అల్లంతో ఆరోగ్యం
అల్లం ట్రెడిషనల్ మెడిసిన్. మాంసాహారంలో అల్లం పడితే ఆ టేస్టే వేరు. అలాగే అల్లంతో టీ చేసుకుని తాగితే ఆ హాయి చెప్పనక్లర్లేదు. ఇంతకీ అల్లం వల్ల కలిగే ఉపయోగాలేంటీ?సాధారణంగా సగటు మనిషి రోజుకు నాలుగు గ్రాములు అల్లం తీసుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ప్రెగ్నెంట్స్ అయితే రోజుకు కేవలం ఒక గ్రాము మాత్రమే తీసుకోవాలి. రెండేళ్ల లోపు పిల్లల్ని అల్లంకు దూరంగా ఉంచడమే మంచిదని పరిశోధనలో తేలింది.*ఉదయాన్నే అల్లం టీ తాగితే ఒంట్లోని సిక్‌నెస్ పోతుంది. పార్శ్వపు తలనొప్పిని తగ్గించే గుణం అల్లంకు ఉంది.
*దగ్గు, జలుబు లక్షణాలనుంచి త్వరగా కోలువచ్చు.
*అల్లం నొప్పుల నివారిణిగా పనిచేస్తుంది. ఆస్తమా నుంచి ఉపశమనం లభించాలంటే అల్లంను ఆశ్రయించాల్సిందే.
*కడుపులో తిప్పినట్లుండటం, వాంతులు వంటి సమస్యల్ని అల్లం పోగొడుతుంది.
*బరువు తగ్గటానికి అల్లం ఉపయోగపడుతుంది.
*క్యాన్సర్ కణాలతో పోరాడే చక్కటి ఔషధం ఇది.
*శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థను పెంచుతుంది.
*కీళ్లనొప్పుల్ని తరిమికొట్టేందుకు అల్లం అద్భుతంగా పని చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది.
*డయాబెటిస్, హార్ట్‌అటాక్ ఉన్నవారు డాక్టర్ల సూచనల మేరకు అల్లాన్ని వాడాలి. ఇక కిడ్నీ వ్యాధులు రాకుండా చేసే గుణం అల్లానికి ఉంది.
*మలేరియా, సొరియాసిస్ వ్యాధిని తరిమికొట్టే చక్కటి హోమ్‌రెమిడీ అల్లం.
No comments:
Post a Comment