చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నివారించే ఒకే ఒక్క ఉల్లిపాయ!!!
ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని ఊరికే అనలేదు. ఎందుకంటే ఉల్లిపాయాలో
శరీరానికి అంతర్గతంగా మరియు బహిర్గతంగా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను
అంధిస్తుంది. వీటిని కేవలం ఉడికించి లేదా పచ్చివి తినడం వల్ల ఈ
ప్రయోజనాలను పొందడం మాత్రమే కాదు, వ్యాధి సంక్రమించిన ప్రదేశంలో అప్లై
చేస్తే చాలు.
అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ ను నేచురల్ గా క్యూర్ చేసే వండర్ ఫుల్ హెల్త్
బెనిఫిట్స్ ఈ ఉల్లిపాయలో ఉన్నాయి . ఒక్క ఉల్లిపాయను ఉపయోగించి అనేక
వ్యాధులను నివారించుకోవచ్చు . ఉల్లిపాయతో వాంతులు, దగ్గు, జలుబు, చాతీలో
నొప్పి, రొమ్ము పడిశము, చెవి నొప్పి మరియు పొట్టనొప్పి వంటినెంటినో గ్రేట్
గా నివారించుకోవచ్చు. అవును ఒక్క ఉల్లిపాయతోనే ఈ జబ్బులన్నీంటే
తగ్గించుకోవచ్చు.
జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి
శరీరం మీద బహిర్గతంగా అయిన గాయాలను మరియు ఇన్పెక్షన్స్ ను మరియు వీటి
ద్వారా రక్త స్రావాన్ని నివారించడంలో ఉల్లిపాయ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది
బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారించి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ యాంటీ బయోటిక్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలను
కలిగి ఉంటుంది. ఉల్లిపాయలో క్యూర్సిటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా
ఉన్నాయి. వివిధ రకాల వ్యాధులకు కారణమయ్యే శరీరంలోని టాక్సిన్స్ ను శరీరం
నుండి ఉల్లిపాయ తొలగిస్తుంది .
ఉల్లిపాయ రసం శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. చాతీలో చేరిన అన్ని
శ్లేష్మం (కఫం) బహిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని బ్యాడ్
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు జాయింట్ పెయిన్, డయాబెటిస్, హార్ట్
సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. మరి ఉల్లిపాయ వివిధ రకాల వ్యాధులను
ఏవిధంగా తగ్గిస్తుందో చూద్దాం...
దగ్గు:
ఉల్లిపాయను రెండు గా కట్ చేయాలి. ఉల్లిపాయ లోపలి బాగంలో ఒక టేబుల్
స్పూన్ బ్రౌన్ షుగర్ అప్లై చేయాలి. ఇలా ప్రతి ఒక్క లేయర్ అప్లై చేసిన
తర్వాత, ఇప్పుడు ఈ రెండు భాగాలను క్లోజ్ చేసి, ఒక జార్లో పెట్టాలి. ఒక గంట
తర్వాత బయటకు తీసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గును నివారిస్తుంది.
ఫీవర్:
జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ హైబాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది.
ఉల్లిపాయను రెండుభాగాలుగా కట్ చేసి, సగం ఒక కాలి పాదం క్రింద, మరో సగం మరో
కాలి పాదం క్రింద ఉంచాలి. తర్వాత సాక్సులు ధరించి రాత్రంతా అలాగే
పడుకోవాలి. ఇలా చేయడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని
టాక్సిన్స్ మరియు జబ్బులను నివారిస్తుంది.
వాంతులు:
ఉల్లిపాయలను గ్రైండ్ చేసి అందు నుండి రసాన్ని తియ్యాలి. ఇప్పుడు
స్ట్రాంగ్ గా పుదీనా టీ తయారుచేసి, 2చెంచాలా ఉల్లిపాయ రసాన్ని త్రాగాలి,
5నిముషాల తర్వాత 2 చెంచాల చల్లటి పుదీనా టీ త్రాగాలి మరియు 5 నిముషాల
తర్వాత దీన్ని రిపీట్ చేయాలి. ఇలా చేస్తుంటే వాంతులు త్వరగా తగ్గుతాయి.
తెగిన గాయాల నుండి రక్తస్రావాన్ని తగ్గిస్తుంది:
ఉల్లిపాయను కట్ చేసి ఉల్లిపాయ ఔటర్ స్కిన్ ను తెగిన గాయం చుట్టూ
చుట్టాలి. ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది . మరియు గాయం చుట్టూ
క్రిములు చేరకుండా నాశనం చేస్తుంది.
జలుబు దగ్గు, కఫం తగ్గిస్తుంది:
ఉల్లిపాయను పేస్ట్ చేసి అందులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి .
ఈ పేస్ట్ ను చాతీ మీద అప్లై చేయాలి. తర్వాత టవల్ ను కప్పాలి. లేదా
రాత్రుల్లో ఇలా చేసి టీషర్ట్ ధరించి పడుకోవడం వల్ల జలుబు, దగ్గు, కఫం
తగ్గుతుంది.
చెవి నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది:
చెవి నొప్పిని మరియు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ సహాయపడుతుంది.
ఉల్లిపాయ పేస్ట్ ను నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . ఆప్రదేశంలో
క్లాత్ తో చుట్టేయాలి .
బేబీస్ లో పొట్టనొప్పిని తగ్గిస్తుంది:
పిల్లల్లో పొట్టనొప్పిని నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
అందుకు చేయాల్సిందల్లా, ఉల్లిపాయను కొద్దిగా నీటిలో వేసి ఉడికించాలి .
ఆనియన్ వాటర్ కూల్ గా అయిన తర్వాత , ఈ వాటర్ ను ఒక చెంచా పిల్లలకు
త్రాగిస్తే తక్షణ రిలీఫ్ పొందుతారు . గంటకొక్కోసారి ఇస్తుంటే నొప్పి
నివారించబడుతుంది.
No comments:
Post a Comment