Tuesday, February 23, 2016

కంచు పాత్రలు తళతళా మెరవాలంటే...చిన్న చిన్న చిట్కాలు


చిన్న చిన్న చిట్కాలతో కంచు పాత్రలను తళతళా మెరిసేలా చేయొచ్చు.. ఎలాగంటే..

ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ పేస్టుని కంచు వస్తువులపై రాసి కాటన్‌ వస్త్రంతో లేదా మెత్తని టూత్‌ బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఒక స్పూన్ బియ్యపు పిండి, అరస్పూన్ ఉప్పు, వైట్‌ వెనిగర్‌లతో పేస్టు చేసుకోవాలి. దీన్ని కంచు వస్తువులకు రాసి అరగంట తరువాత శుభ్రంగా కడగాలి. చాక్‌పీస్‌ పొడి లేదా ముగ్గులో డిస్టిల్డ్‌ వాటర్‌ పోసి పేస్టులా చేసుకోవాలి. దీనితో వస్తువులను రుద్ది కొద్దిసేపటి తరువాత కడగాలి.అన్నింటికన్నా సులువైన మార్గం వర్షపు నీటితో కడగడం. గిన్నెలు కడిగే సబ్బుతో కంచుతో తయారుచేసిన వస్తువులను రుద్ది వర్షపునీటితో కడిగితే తళతళా మెరుస్తాయి

No comments:

Post a Comment