Wednesday, February 24, 2016

తరచూ మీకు ఒక్కే రకమైన తలనొప్పి వస్తుందా

లక్షణాలు
మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తలనొప్పితో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును, శబ్దాలనూ భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.



ఈ లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము, సూదులతో గుచ్చినట్లు అనుభూతి కల్గడమూ జరుగుతుంది.
కళ్ళు తిరగడం, బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు. ఈ లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తితో బాదినట్లు వస్తుంది.
ఆకలి మందగిస్తుంది.
ఈ లక్షణాలు సాధారణంగా 6 గం నుండి 8 గం వరకు వుంటాయి.
స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటుంది.

కారణాలు
మానసిక వత్తిడి – తలనొప్పి
అధిక శ్రమ
ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు
ఋతు క్రమములో తేడాలు.
కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపించే అవకాశం ఉంటుంది.
మత్తుపానీయాలు – పొగత్రాగుట
మైగ్రేన్ లక్షణాలు తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుంచించుకు పోవడం వలన ప్రారంభమవుతుంది. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించి తలనొప్పి వస్తుంది.
నివారణ
ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండి స్వల్ప మార్పులతో సాధారణ జీవిత విధానాన్ని అలవరచుకోవాలి
ఇంటిలో వున్నప్పుడు చీకటి గదిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.
ద్రవ పదార్దాలు, నీళ్ళు ఎక్కువ మోతాదులో తాగాలి.
నీటిలో తడిపిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి తీసుకొన్నచో కొంత ఉపశమనం ఉంటుంది.
ఏ మాత్రము సందేహము వున్నా గర్బ నిరోధక మాత్రలు తీసుకోకూడదు. ఇతర కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించాలి.
కొందరు స్త్రీలలో మెనోపాజ్ వయస్సు రాగానే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.
డాక్టరును సంప్రదించి మాత్రమే వైద్యం చేయించుకోవాలి.

No comments:

Post a Comment