Tuesday, February 23, 2016

దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే...

దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే...
ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్లు రుద్దుకొని కొద్దిసేపటి తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లకుండే పసుపు రంగు పోతుంది.
ప్రతిరోజూ బత్తాయి తొక్కలతో పళ్లు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
లవంగాలను పొడిచేసి దానితో పళ్లు రుద్దుకోవాలి. ఇలా చేయడంవల్ల పళ్లు తళతళా మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి. తులసి ఆకుల్నిఎండబెట్టి పొడి చేసి దీనితో ప్రతిరోజూ బ్రష్ చేస్తే పళ్లపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి దానిలో చిటికెడు తినేసోడా వేయాలి. ఈ మిశ్రమంతో పళ్లను రుద్దుకోవాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్-సి, యాసిడ్లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి.

No comments:

Post a Comment