Wednesday, February 24, 2016

పెరుగు తింటే ఆరోగ్యం....!!

పెరుగు తింటే ఆరోగ్యం....!!పెరుగు తింటే ఆరోగ్యం.. ! కానీ పెరుగు తినడంపై చాలా అపోహలున్నాయి. కాస్త జ్వరం, దగ్గు, జలుబు, గాయాలు తగిలినప్పుడు పెరుగు తినకూడదు అని చెబుతుంటారు. కానీ పెరుగులో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు.. అనారోగ్యంతో ఉన్నప్పుడు పెరుగు ఎందుకు తినకూడదు అంటారు ? అంతేకాదు.. రాత్రిపూట పెరుగు తినవచ్చా ? తినకూడదా ? అనేది మరో పెద్ద డైలమా ? కొంతమంది రాత్రిపూట పెరుగు తినవచ్చు అంటే.. మరికొందరు అస్సలు రాత్రి పూట డిన్నర్ లో పెరుగు చేర్చుకోనేకూడదు అంటారు ? అసలు ఏది వాస్తవం ?? పెరుగులో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వాళ్లు కనీసం పెరుగైనా డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మంచిది. ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు, ట్రెండ్స్ కారణంగా.. మంచి బ్యాక్టీరియాని కోల్పోతున్నాం. కాబట్టి ఇది పుష్కలంగా లభించే.. పెరుగుని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి డైట్ లో కంపల్సరీ పెరుగు చేర్చుకోవాలి. అయితే రాత్రి పూట కూడా పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు తరచుగా జలుబు చేసే అలర్జీ ఉన్నవాళ్లు మాత్రం పెరుగు రాత్రిపూట తీసుకోకపోవడం మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే.. పెరుగు కఫంకి కారణమవుతుందని ఆయుర్వేదం రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని సూచిస్తుంది. అయితే ఇది అందరూ పాటించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎక్కువగా జలుబు, దగ్గుతో బాధపడతారో వాళ్లు మాత్రమే కర్డ్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా నచ్చితే మజ్జిగ తీసుకున్నా మంచిదని సూచిస్తున్నారు.


100 గ్రాముల పెరుగులో శాఖహార భోజనంలో పెరుగు కీలకం. 89 శాతానికి పైగా నీటిని కలిగి ఉండే పెరుగులో నాణ్యమైన ప్రోటీన్లు, దాదాపు అన్ని రకాల ఎమినో యాసిడ్‌లు, కాల్షియం తగినస్థాయిలో లభిస్తాయి. కాబట్టి నిత్యం పెరుగును తీసుకోవడం మానకండి.
జీర్ణశక్తి ఆహారం జీర్ణం కావ‌డానికి పెరుగు తోడ్ప‌డుతుంది. ఇందులో ఉన్న పోష‌కాలు జీర్ణ‌వ్య‌వ‌స్థ పనితీరుకు సహకరిస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగులో శ‌రీరానికి మేలుచేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతుంది. శ‌రీరానికి చెడుచేసే బ్యాక్టీరియాను నివారిస్తుంది.


ఎముకల బలానికి పెరుగులో క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల‌ను, ప‌ళ్ల‌ను బ‌లంగా ఉంచుతాయి. కాబట్టి నిత్యం పెరుగు తీసుకుంటే.. ఎముకల ఆరోగ్యానికి మంచిది.
గుండె ఆరోగ్యం పెరుగు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పెరుగుకి ర‌క్త‌పోటుని అదుపులో ఉంచే శ‌క్తి ఉంటుంది. ర‌క్త‌నాళాల్లో, శ‌రీరంలో కొవ్వు చేర‌కుండా నివారించే శక్తి పెరుగుకు ఉంటుంది.
పైల్స్ మొలల సమస్యతో బాధపడేవాళ్లకు పెరుగు చక్కటి పరిష్కారం. నిత్యం పెరుగన్నం తీసుకుంటే.. పైల్స్ ను అరికడుతుంది. పెరుగన్నానికి కాస్త అల్లం జోడించి తింటే మంచి ఫలితం ఉంటుంది.


No comments:

Post a Comment