Friday, February 12, 2016

ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకల బెడద ఎక్కువైందా ?

ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకల బెడద ఎక్కువైందా ?

ఇల్లు, వాకిలి పరిశుభ్రంగా ఉండాలని, చూపరులను ఇట్టే ఆకట్టుకోవాలని, ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బొద్దింకలు, చీమలు వంటి కీటకాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇంట్లో ఏ అలమర చూసినా.. బొద్దింకలు వేధిస్తుంటాయి. బాతూరూం, సింక్, కప్ బోర్డ్స్ ఇలా.. ఎక్కడ చూసినా..బొద్దింకలు తిరుగుతూ.. చిరాకు తెప్పిస్తుంటాయి. మార్కెట్ లో దొరికే స్ర్పేలు కొంతమందికి అలర్జీలకు కారణమవుతుంటాయి. అంతేకాకుండా.. ఇందులో వాడే కెమికల్స్ కొన్ని ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంటాయి.
ఇంట్లో బొద్దింకలను చూస్తే కొంతమంది భయపడిపోతారు. కొంతమంది వాటిని చంపేస్తారు. మరికొంతమంది.. వాటిని బయటకు తరిమేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో ఎలా ప్రయత్నించినా.. వాటి బెడత మాత్రం తగ్గిపోదు. మార్కెట్ లో దొరికే స్ర్పేలు వాడినా.. మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న చిట్కాలతో బొద్దింకలను తరిమేయవచ్చు. ఇంట్లో తరచూ ఉపయోగించే వస్తువులతో బొద్దింకల బెడద తగ్గించుకునే మార్గాలున్నాయి. అలాంటప్పుడు సింపుల్ టిప్స్ తో బొద్దింకలను ఎలా నిర్మూలించవచ్చో ఇప్పుడు చూద్దాం..

చిరాకు తెప్పించే బొద్దింకలు నిర్మూలించడం ఎలా ?

వెల్లుల్లి

వెల్లుల్లిని మెత్తగా దంచి నీళ్ళలో కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచితే చాలు బొద్దింకలు రావు.

గోధుమపిండి

వంటింట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటే బోరిక్‌ పౌడర్‌, కొద్దిగా పంచదార, గోధుమ పిండి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి వంటింట్లో అన్ని మూలలా పెడితే బొద్దింకలు మాయమవుతాయి.

దోసకాయ ముక్కలు

బొద్దింకలు రాకుండా ఉండాలంటే.. దోసకాయ ముక్కలను ఎండబెట్టి కప్‌బోర్డుల్లో, అల్మారాల్లో ఉంచితే చాలు. లేదంటే దోసకాయ తొక్క తీసి బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఉంచినా బొద్దింకలు తగ్గిపోతాయి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లాలి. దీనివల్ల కచ్చితంగా బొద్దింకలు కనిపించకుండా పోతాయి.

బిర్యానీ ఆకు

బొద్దింకలు తిరిగే ప్రదేశంలో బిర్యానీ ఆకులను పౌడర్ చేసి చల్లడం వల్ల ఆ వాసనకే అవి చచ్చిపోతాయి.

సోప్ వాటర్

సోప్‌వాటర్‌లో బొద్దింకలు చాలా సమయం ఉండలేవు. కాబట్టి కొద్దిగా నీళ్లలో సోపు వేసి బాగా కలపాలి. ఈ నీళ్లను బొద్దింకల మీద చల్లడం వల్ల క్షణాల్లో చనిపోతాయి. ఇక బొద్దింకల సమస్య ఉండదు.

ఎండిపోయిన నిమ్మతొక్కలు

ఎండబెట్టిన నిమ్మ డిప్పలను వార్డ్‌ రోబ్‌ల్లో వేసుకుంటే పురుగులు బొద్దింకలు, చీమల బెడద ఉండదు.

No comments:

Post a Comment