మీ ఫోన్‌లో డేటా(ఇంటర్‌నెట్) ఆన్‌లో ఉంటేనే ఫోన్ లొకేట్ అవుతుంది. లేకపోతే చివరిసారిగా ఆ ఫోన్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉందో కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను మాత్రమే ఇలా వెతికేందుకు అవకాశం ఉంది. ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్‌పై ఆధారపడాల్సిందే.
Wednesday, March 2, 2016
ఫోన్ పోయిందా?.. గూగుల్‌లో వెతకండిలా!
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడో పెట్టి
మరిచిపోయారా? లేదా ఎవరైనా దొంగిలించారా? అయితే, మీ ఫోన్ ఎక్కడుందో గూగుల్
సెర్చ్ ద్వారా సులభంగా వెతుక్కోవచ్చు! ఎలాగంటే..
మీ ఫోన్‌లో గతంలో రిజిస్టర్ చేసుకున్న గూగుల్ (జీమెయిల్)
అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. గూగుల్ సెర్చ్ హోం పేజీకి వెళ్లి ‘వేర్
ఈజ్ మై ఫోన్?’ అని టైప్ చేయండి. గూగుల్ మ్యాపు, మ్యాపుపై బాక్స్
కనిపిస్తుంది. బాక్స్‌లో ‘లొకేట్ ఫోన్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మ్యాపుపై మీ
ఫోన్ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది. ‘రింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ
ఫోన్ సైలెంట్‌లో ఉన్నా పూర్తి వాల్యూమ్‌తో 5 నిమిషాలు మోగుతుంది.
బాక్స్‌లోని ‘ఎనేబుల్ లాక్ అండ్ ఎరేజ్’ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త
పాస్‌వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ‘దయచేసి ఈ ఫోన్‌ను ఫలానా చోట తిరిగి
ఇచ్చేయండి.. ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి.. అంటూ పోయిన ఫోన్ లాక్
స్ర్కీన్‌పై కనిపించేలా మెసేజ్, కొత్త ఫోన్ నెంబర్‌నూ పంపొచ్చు.
మీ ఫోన్‌లో డేటా(ఇంటర్‌నెట్) ఆన్‌లో ఉంటేనే ఫోన్ లొకేట్ అవుతుంది. లేకపోతే చివరిసారిగా ఆ ఫోన్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉందో కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను మాత్రమే ఇలా వెతికేందుకు అవకాశం ఉంది. ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్‌పై ఆధారపడాల్సిందే.
మీ ఫోన్‌లో డేటా(ఇంటర్‌నెట్) ఆన్‌లో ఉంటేనే ఫోన్ లొకేట్ అవుతుంది. లేకపోతే చివరిసారిగా ఆ ఫోన్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉందో కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను మాత్రమే ఇలా వెతికేందుకు అవకాశం ఉంది. ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్‌పై ఆధారపడాల్సిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment