రక్తం గడ్డకట్టే అతిశీతల ఉష్ణోగ్రతలో
దేశరక్షణే ఏకైక ధ్యేయంగా
శత్రుసంహారణే జీవిత పరమావధిగా
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నఓ సైనికుడా!! వందనం!!
నీ రక్తంలోని త్యాగమేభరతమాత మేనికి దివ్య చందనం!!
తల్లీ, తండ్రీ, భార్యాబిడ్డలను ఎడబాసితనువులోని అణువణువూ దేశానికి అంకితం చేసిదేశ ప్రజల రక్షణ పోరాటంలోప్రాణాలను తృణప్రాయంగా ఎంచే ఓ సైనికుడా!! వందనం!!
నీ త్యాగనిరత స్ఫురణయేభరతమాత హృదయానికి నిత్య నందనం!!!
ఏమిచ్చి తీర్చుకోగలమయ్యా మీ రుణం?శిరస్సు వంచి ముకుళిత హస్తాలతో ముద్దాడుతాం!మీ పార్థివ దేహాల పాదాలను మేమందరం!ఓ సైనికుడా! నీకు వందనం!!
హనుమంతు ఆత్మకు శాంతి కలగాలని.....
జైహింద్....
No comments:
Post a Comment