Wednesday, May 11, 2016

పచ్చి ఉల్లిపాయ ముక్కలను చర్మంపై రుద్దడం వల్ల ఎలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చో తెలుసా..?

పచ్చి ఉల్లిపాయ ముక్కలను చర్మంపై రుద్దడం వల్ల ఎలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చో తెలుసా..?
‘ఉల్లి చేసే మేలు తల్లి’ కూడా చేయదంటారు. అయితే ఎవరైనా వారి ప్రాధాన్యం వారికే ఉంటుంది. తల్లే లేకపోతే మనం ఉండం కదా. అలాగే ఉల్లిపాయ లేనిదే మనం ఏ వంటను వండం కదా. ఈ క్రమంలోనే ఇద్దరి ప్రాధాన్యత అంతగా ఉంటుందని తెలియజేయడం కోసమే ఆ సామెతను చెబుతారు. అయితే ఇప్పుడు చెప్పబోయేది సామెతను గురించి కాదు లెండి. ఉల్లిపాయ వల్ల మనకు కలిగే లాభాల గురించి. ఇప్పటికే ఎన్నో చదివాం, అంటారా? అయితే ఇప్పుడు చెప్పేవి కూడా ట్రై చేయండి. దాంతో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి కదా!
1. కొద్దిగా పసుపు, పచ్చి ఉల్లిపాయ జ్యూస్ను తీసుకుని మిశ్రమంగా కలపాలి. అనంతరం దాన్ని చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్, పిగ్మెంటెడ్ స్కిన్పై రాయాలి. దీని వల్ల చర్మం మృదువుగా మారడమే కాదు, మచ్చలు కూడా తొలగిపోతాయి.
2. మహిళలకు రుతు సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గించడంలో ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి. రుతు క్రమం ప్రారంభమవుతుందనగా దానికి కొద్ది రోజుల ముందు నుంచి పచ్చి ఉల్లిపాయలను తింటుంటే కడుపు నొప్పి సమస్య బాధించదు.
3. ఉల్లిపాయలను చక్రాల్లా గుండ్రంగా తరిగి అందులో ఒక ముక్కను దవడపై ఉంచాలి. ఇలా చేస్తే దంతాల నొప్పి తగ్గుతుంది.
4. పచ్చి ఉల్లిపాయలను తరచూ తింటుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరగడమే కాదు, అవి దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
5. దోమలు, పురుగుల వంటివి కుట్టినప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కను ఆ ప్రదేశంలో మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో అక్కడ ఏర్పడే నొప్పి, వాపు తగ్గిపోతుంది.
6. పచ్చి ఉల్లిపాయలను తింటుంటే గాలి కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వివిధ అనారోగ్యాల నుంచి కూడా మనకు రక్షణ లభిస్తుంది.
7. ఉల్లిపాయ మధ్యలో ఉండే ముఖ్యమైన భాగాన్ని చెవిపై పెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచి నిద్రిస్తే తెల్లారే సరికి చెవి నొప్పి మటుమాయమవుతుంది.
8. సాక్సులు వేసుకుని వాటి లోపలి వైపు పాదాల కిందుగా ఉల్లిపాయ ముక్కలను రాత్రంతా ఉంచి నిద్రిస్తే జ్వరం తగ్గుతుంది. ఒళ్లు నొప్పులు, నీరసం కూడా పోతాయి.
9. పచ్చి ఉల్లిపాయ ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రి పడుకునే ముందు పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట తగ్గుతాయి.
10. వేళ్లపై ఏవైనా చెక్క ముక్క లాంటివి గుచ్చుకుంటే దానిపై చిన్న ఉల్లిపాయ ముక్కను ఉంచి కట్టుకట్టాలి. దీంతో లోపలికి గుచ్చుకున్న ఆ ముక్కలు బయటికి వస్తాయి.
11. కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గుతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు.
తగ్గుతుంది. ఒళ్లు నొప్పులు, నీరసం కూడా పోతాయి.

No comments:

Post a Comment