Tuesday, February 23, 2016

జిడ్డు వదిలించేద్దామిలా...!

జిడ్డు వదిలించేద్దామిలా...!
తలంటుకోవడానికి ముందు రాసుకునే నూనె ఎలాంటిదైనా సరే ....జిడ్డు అంతా అంతా వదిలిపోయేలా స్నానించాలి. లేదంటే ఆ జిడ్డుకు జుట్టు నిర్జీవంగా కనిపించడమే కాదు...దుమ్మూదూళీ చేరుకుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే..
* ఆముదం వంటి మందంగా ఉన్న నూనెలు వాడటం వల్ల జిడ్డు ఎక్కువగా అంటుకుంటుంది. ఓ పట్టాన వదలదు కూడా ...అప్పుడేం చేయాలంటే.. తలస్నానం చేశాక వంటసోడాలో నీళ్లు కలిపి.. తలకు రాసుకోవాలి. కాసేపయ్యాక ఎక్కువ నీళ్లతో జుట్టును కడిగేయాలి. జిడ్డును తొలగించే గుణం వంటసోడా ప్రత్యేకత.
* సహజంగానే జిడ్డుజుట్టు ఉన్నవారు వెనిగర్‌ వంటి సహజ కండిషనర్లు వాడాల్సిందే.
* గుప్పెడు ఓట్స్ ‌ని గిన్నెలో తీసుకుని.. రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. గోరువెచ్చగా అయ్యాక ఆ నీళ్లని వడకట్టి.. తలస్నానం చేశాక తలమీద పోసుకోవాలి. ఇలా కొన్ని వారాల పాటు చేయడం వల్ల జిడ్డు సమస్య అదుపులోకి వచ్చి జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
* గుడ్డులోకి తెల్లసొనా, నిమ్మరసం సమపాళ్లలో కలిపి... తలకురాసుకోవాలి. గంట తరవాత హెర్బల్‌ షాంపూతో తలస్నానం చేస్తే జిడ్డు వదిలిపోతుంది.





No comments:

Post a Comment