Sunday, February 21, 2016

మాన జిల్లా నిజామాబాదు చరిత్ర

జిల్లా పేరు వెనుక చరిత్ర
నిజామాబాదును 8వ శతాబ్దములో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చినది. ఇందూరుకు పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రపురి అని ఒక రాజు పేరు మీదుగా పేరు వచ్చిందని భావించబడుతున్నది. కానీ ఆ రాజు క్రీ.శ.388 ప్రాంతంలో నర్మదా, తపతిల దక్షిణ ప్రాంతాన్ని పాలించిన త్రికూటక వంశానికి చెందిన ఇంద్రదత్తుడా, విష్ణుకుండిన చక్రవర్తి మొదటి ఇంద్రవర్మనా ఇదమిద్ధంగా తెలియడం లేదు. 20వ శతాబ్దం తొలినాళ్ళ వరకు కూడా ఈ ఊరు, జిల్లా ఇందూరుగానే పిలవబడింది.[1]1901వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్ పేరు పెట్టి, జిల్లా పేరును నిజామాబాదుగా మార్చడం జరిగింది.

జిల్లా చరిత్ర
జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్' (చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి.

జిల్లాలోని సంస్థానాలు
రాజులకు సేవచేసిన కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేసేవారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారినే సంస్థానాధీశులుగా పేరుపొందారు. సంస్థానాలు అంటే చాలామొత్తంలో ఎక్కువ గ్రామాలు అధికారి ఏలుబడి కింద ఉండడం. ముస్లిం రాజుల పరిపాలనలో అధికార భాషలుగా ఫారసీ, ఉర్దూ ఉండేవి. జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాల ఆనవాళ్ళు నేటికీ పదిలం.

కౌలాస్
కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత బహమనీ సుల్తానులు కౌలస్ దుర్గాన్ని వశపరచుకున్నారు. ఈ సంస్థానానికి ఔరంగజేబు ద్వారా రాజా పథంసింగ్ గౌర్ ను కౌలాస్ సంస్థానాధీశునిగా నియమితులయ్యారు. ఇతని వారసులు స్వాతంత్ర్యం వరకు అసఫ్ జాహి నైజాం రాజులకు సామంతులుగా వారి రాజ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషించారు. రాజా దీప్ సింగ్ 1857 తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి బ్రిటీషువారిచే శిక్షకు గురయ్యాడు. శత్రు దుర్భేద్యమైన అప్పటి కట్టడాలు ఇప్పటికీ వాటి నిర్మాణ చాతుర్యాన్ని చాటుతున్నాయి.

సిర్నాపల్లి సంస్థానం
జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది. నిజాం నవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్ వాయి, నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి, కోటగల్లిగడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్ వాయి, డిచ్ పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు.

వెల్మల సంస్థానం
జిల్లాలో వెల్మల్ సంస్థానం పురాతనమైనది. దీని క్రింద వెల్మల్, కల్లెడి, గుత్ప తదితర గ్రామాలుండేవి.

దోమకొండ సంస్థానం
ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.

హైదరాబాదు రాజ్యం యొక్క బీదరు సుబాలో ఇందూరు జిల్లాగా ఉన్నది. 1905లో ఇందూరు తాలుకాలోని నిర్మల్, నర్సాపూరు= తాలూకాలను కొత్తగా ఏర్పడిన అదిలాబాదు జిల్లాలో చేర్చారు. మధోల్ తాలూకా మరియు బాన్స్‌వాడలోని కొంతభాగం నాందేడ్ జిల్లాలో చేర్చారు. మిగిలిన బాన్స్‌వాడ తాలూకాను యెల్లారెడ్డి, బోధన్ తాలుకాలోకి చేర్చారు. భీంగల్‌ను ఆర్మూరు తాలూకాలో కలిపి, యెల్లారెడ్డిపేట, కామారెడ్డిపేట తాలూకాలో మరికొన్ని మార్పులు చేసి కొత్తగా ఏర్పడిన జిల్లాకు నిజామాబాదు జిల్లాగా నామకరణం చేశారు.[2] జిల్లా ఏర్పడినప్పుడు ఐదు తాలూకాలుండేవి - ఇందూరు, ఆర్మూరు, కామారెడ్డి, యెల్లారెడ్డి, బోధన్. 1930వ దశకంలో యెల్లారెడ్డి, బోధన్ తాలూకాల నుండి బాన్స్‌వాడ తాలూకాను తిరిగి ఏర్పరచారు.

భౌగోళిక స్వరూపం
జిల్లాకు సరిహద్దులుగా, ఉత్తరాన అదిలాబాదు జిల్లా, తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్ జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక లోని బీదరు జిల్లా మరియు మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. 18-5' మరియు 19' ఉత్తర అక్షాంశాల మధ్య, 77-40' మరియు 78-37' తూర్పు రేఖాంశాల మధ్య జిల్లా విస్తిరించి ఉన్నది. సముద్రతీరానికి సుదూరంగా ఉండటంచేత జిల్లా వాతావరణం భూమధ్యరేఖా వాతావరణం గాను, విపరీత ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉంటాయి. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెం, సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.9 డిగ్రీల సెం గాను ఉన్నాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు సెం వరకు పడిపోవడం, వేసవిలో 47'డిగ్రీలు సెం వరకు పెరగడం కూడా కద్దు. జిల్లా విస్తీర్ణం 7956 చ.కి.మీ, అనగా 19,80,586 ఎకరాలు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న 923 గ్రామాల్లో 866 నివాసమున్నవి కాగా, 57 గ్రామాలు ఖాళీ చెయ్యబడినవి గానీ, లేక నీటిపారుదల ప్రాజెక్టులలో ముంపుకు గురయినవి గాని.
ఆర్ధిక స్థితి గతులు

2006లో భారత ప్రభుత్వం నిజామాబాదు జిల్లాను, దేశంలోని మొత్తం 640 జిల్లాలలోకెల్లా ఆర్ధికంగా వెనుకబడిన 250 జిల్లాలలో ఒకటిగా గుర్తించింది.[3] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథకం క్రింద ఆర్ధిక సహాయాన్ని పొందుతున్న పదమూడు జిల్లాలలో నిజామాబాదు జిల్లా కూడా ఒకటి.[3]
మండలాలు, పాలనా విభాగాలు

7,956 చదరపు కిలోమీటర్ల విస్తీరణం కల నిజామాబాదు జిల్లాను పరిపాలనా సౌలభ్యం కొరకు మూడు రెవిన్యూ డివిజన్లుగానూ, 36 రెవిన్యూ మండలాలుగానూ విభజించారు.[4] జిల్లాలో మొత్తం 922 గ్రామాలున్నాయి. అందులో 64 నిర్జన గ్రామాలు. మొత్తం 718 గ్రామపంచాయితీలున్నాయి. జిల్లాలో ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ నిజామాబాదు అయితే, బోధన్, కామారెడ్డి, ఆర్మూరు మునిసిపాలిటీలు.[5]

మండలాల జాబితా
నిజామాబాదు జిల్లా మండలాలు 
1.రెంజల్

2.నవీపేట్

3.నందిపేట్

4.ఆర్మూరు

5.బాలకొండ

6.మోర్తాడ్

7.కమ్మర్‌పల్లి

8.భీమ్‌గల్

9.వేల్పూరు

10 . జక్రాన్‌పల్లి

11.మాక్లూర్

12.నిజామాబాదు మండలం

13.యెడపల్లె

14.బోధన్

15.కోటగిరి

16.మద్నూరు

17.జుక్కల్

18.బిచ్‌కుంద

19.బీర్కూర్

20.వర్ని

21.డిచ్‌పల్లి

22.ధర్‌పల్లి

23.సిరికొండ

24.మాచారెడ్డి

25.సదాశివనగర్

26.గాంధారి

27.బాన్స్‌వాడ

28.పిట్లం

29.నిజాంసాగర్

30.యెల్లారెడ్డి

31.నాగిరెడ్డిపేట

32.లింగంపేట

33.తాడ్వాయి

34.కామారెడ్డి

35.భిక్నూర్

36.దోమకొండ

ముఖ్య పట్టణాలు
    కామారెడ్డి
    బాన్స్వాడ
    ఆర్మూర్
    యెల్లారెడ్డి
    బొధన్
    భీమ్‌గల్

రవాణా వ్వవస్థ
జిల్లా గుండా సికింద్రాబాదు- నాందేడ్ మార్గం వెళ్ళుచుండగా, జానకంపేట నుంచి బోధన్ వరకు మరో మార్గం ఉంది. జిల్లాలో మొత్తం కిమీ పొడవు కల మార్గంలో 15 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.[6] కరీంనగర్ నుంచి నిజామాబాదుకు కొత్తగా నిర్మిస్తున్న రైలుమార్గం పురోభివృద్ధిలో ఉంది. జిల్లా గుండా ఉత్తర-దక్షిణంగా 44వ నెంబరు జాతీయ రహదారి మరియు నిజామాబాదు - భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్ళుచున్నాయి. కామారెడ్డి, డిచ్ పల్లి, నిజామాబాదు, ఆర్మూరు జాతీయరహదారి పై ఉన్న ప్రధాన పట్టణాలు.
జనాభా లెక్కలు

నిజామాబాదు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా తర్వాత రెండవ అత్యల్ప జనాభా గల జిల్లా.[7] 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లా జనాభా 25,52,073. స్త్రీ, పురుషుల నిష్పత్తి 1038:1000. భారతదేశ జనాభాతో పోల్చుకుంటే, జిల్లాలో పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం అక్షరాస్యత 53.26 శాతం (2001 జనగణన). జిల్లాలో






No comments:

Post a Comment